Prashant Kishor : వైసీపీపై మైండ్ గేమ్.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏంటి ?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఏపీ రాజకీయాలో పెద్ద దుమారమే రేపారు.2019 ఎన్నికల్లో వైసిపి తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.ఆ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ వ్యూహాలు అందించింది.అయితే ఇప్పుడు మాత్రం టిడిపికి ప్రశాంత్ కిషోర్ మద్దతుగా నిలిచారు .పశ్చిమబెంగాల్,  తమిళనాడు ఎన్నికల తర్వాత తాను రాజకీయ వ్యవహర్తగా తప్పుకుంటున్నానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు .తన సొంత రాష్ట్రమైన బీహార్ లో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని పాదయాత్ర సైతం నిర్వహించారు .కాకపోతే జనాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో,  ప్రశాంత్ కిషోర్ నిరాశ కు గురయ్యారు.ఇతర రాష్ట్రాల్లో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చే విధంగా వ్యూహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ ,సొంత రాష్ట్రంలో మాత్రం గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు.

 Prashant Kishor : వైసీపీపై మైండ్ గేమ్.. ప్-TeluguStop.com

ఇక ఆ తర్వాత నుంచి మళ్లీ వ్యూహకర్తగా సేవలందించేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమైనట్లుగానే వ్యవహరిస్తున్నారు.కొద్ది రోజులు పాటు , తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసే తప్పుకున్నారు.

ఇప్పుడు టిడిపి తరఫున పనిచేసేందుకు పెద్దమవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Pack, Janasena, Lokesh, Prashant Kishor, Te

ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Skill Development Scam ) లో అరెస్ట్ అయిన దగ్గర నుంచి టిడిపి ప్రశాంత్ కిషోర్ సలహాలు కోసం ప్రయత్నిస్తూ వస్తోంది.  కొద్ది నెలల క్రితం ఏపీకి వచ్చి మరీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడం రాజకీయంగా సంచలనం రేపింది .తాజాగా హైదరాబాదులో చంద్రబాబుతో సమావేశమైన ప్రశాంత్ కిషోర్ అభ్యర్థుల ప్రచార వ్యవహారలపై సలహాలు సూచనలు ఇచ్చారట.ఈ సందర్భంగా ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని, ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని , ఉచిత పథకాలకు కాదని,  తెలంగాణలోనూ కేసీఆర్ ఇదే చేసి దెబ్బతిన్నారని ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది .ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను వైసిపి ఖండిస్తోంది.

<

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Pack, Janasena, Lokesh, Prashant Kishor, Te

 గతంలో తెలంగాణలో కెసిఆర్ గెలుస్తారని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారని ,కానీ బీఆర్ఎస్ ఓటమి చెందిందని,  అలాగే మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ లో బిజెపికి వ్యతిరేకంగా సర్వే నివేదికలు వెల్లడించారని , కానీ రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి అధికారంలోకి వచ్చిందని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.టిడిపి( TDP )తో కలిసి మైండ్ గేమ్ ఆడేందుకే ఈ విధంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానిస్తున్నారని , ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube