తుపాను ప్రభావం నెల్లూరు..చెన్నై జాతీయ రహదారి మధ్య నిలిచిపోయిన రాకపోకలు..!!

మిచౌంగ్ తుపాను( Michaung Cyclone ) ప్రభావం గట్టిగా ఉంది.బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాను తిరుపతి, నెల్లూరు జిల్లాలపై అత్యధిక ప్రభావం చూపిస్తుంది.

 Michaung The Impact Of The Cyclone Stopped The Traffic Between Nellore And Chenn-TeluguStop.com

మిచౌంగ్ ప్రభావంతో ఈ రెండు జిల్లాలలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.దీంతో నెల్లూరు చెన్నై జాతీయ రహదారిపై( Nellore Chennai Highway ) సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది.

దీంతో అప్రమత్తమైన అధికారులు.జాతీయ రహదారి మూసివేయడం జరిగింది.

దీంతో నెల్లూరు చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.ఇదే సమయంలో తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేయడం జరిగింది.

ఈ క్రమంలో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులలో( Tirumala Tirupati Ghat Road ) ద్విచక్ర వాహనదారులకు ఆంక్షలు విధించడం జరిగింది.ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఘాట్ రోడ్ లపై ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.ఇక ఇదే సమయంలో ప్రభుత్వం ఈ రెండు జిల్లాలలో పునరావాస కేంద్రాలు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది.మిచౌంగ్ తుపాన్ మంగళవారం తీరాన్ని తాకే సమయంలో మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలియజేయడం జరిగింది.ఇదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీలైనంత వరకు బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube