సినిమాలు, రాజకీయాలు మరియు బసవతారకం హాస్పిటల్ బాధ్యతలు, ఈ మూడే బాలకృష్ణ ప్రపంచం.అలాంటి బాలయ్య బాబు ని హోస్ట్ గా చేసి ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ లాంటి టాక్ ని నిర్వహించింది ఆహా మీడియా.
బాలయ్య( Balakrishna ) ఏంటి హోస్ట్ ఏంటి అసలు మ్యాచ్ అవ్వుదా అని అప్పట్లో అనుకునేవాళ్లు అందరూ.కానీ అన్ స్టాపబుల్ షో( Unstoppable ) కి బాలయ్య నిర్వహించిన హోస్ట్ బాధ్యతలు ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.
చేస్తే ఈ రేంజ్ ఫన్ తో హోస్టింగ్ చెయ్యాలి అని అనిపించేలా చేసాడు బాలయ్య బాబు.ఇప్పటి వరకు రెండు సీజన్స్ ని పూర్తి చేసుకుంది ఈ బిగ్గెస్ట్ టాక్ షో.ఈ రెండు సీజన్స్ లో ఎంతో మంది టాప్ స్టార్ సెలబ్రిటీస్ తో బాలయ్య బాబు చేసిన సరదా చిట్ చాట్ ఎన్ని సార్లు చూసినా తనిమితీరదు అన్నట్టుగా ఉంటుంది.
మూడవ సీజన్ ఇక ఉండదేమో అని అందరూ అనుకున్నారు, కానీ చిన్న లిమిటెడ్ వెర్షన్ తో రీసెంట్ గానే ప్రారంభించింది ఆహా టీం.ఈ లిమిటెడ్ ఎడిషన్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయబోతున్నాడు అని ఈ సీజన్ ప్రారంభం కాకముందు నుండే ఒక పెద్ద టాక్ ఉండేది.ఈ షో నిర్వాహకులు అల్లు అరవింద్ నిజంగానే చిరంజీవి ని సంప్రదించాడట.
అడిగిన వెంటనే డేట్స్ చూసుకొని ఇస్తాను అన్న చిరంజీవి, ఇప్పుడు మాత్రం ఈ షో లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట.ఇదే ఇప్పుడు సోషల్ మీడియా( Social media ) లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
చిరంజీవి మరియు బాలయ్య మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఈమధ్య వచ్చిన విషయం వాస్తవమే.అనేక సందర్భాల్లో బాలయ్య బాబు కొన్ని విషయాల్లో చిరంజీవి పై అసంతృప్తి వ్యక్తం చేసాడు.
కానీ ఆ గ్యాప్ తొందరలోనే పోతుంది, ఇద్దరు మంచి స్నేహితులుగా మెలుగుతారు అని అందరూ అనుకున్నారు.
చిరంజీవి( Chiranjeevi ) తో ఈమధ్య కాలం లో బాలయ్య బాబు కలిసి చాలా రోజులు అయ్యింది కానీ, ఆయన కుటుంబం లో ఉన్న రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ తో ఈమధ్య కాలం లో చాలా సార్లు కలిసాడు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ తో ఎంతో ఆప్యాయంగా బాలయ్య బాబు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి.ఆయన కుటుంబం తో ఇంత మంచి సాన్నిహిత్యం మైంటైన్ చేస్తున్న బాలయ్య చిరంజీవి తో మాత్రం ఎందుకు దూరం మైంటైన్ చేస్తున్నాడు అనేది ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న.
వీళ్ళ మధ్య గ్యాప్ తొలగిపోవడానికి ‘అన్ స్టాపబుల్’ షో కి ఆహ్వానించాడు అల్లు అరవింద్.బాలయ్య కలిసిపోవడానికి సిద్ధం గా ఉన్నా, ఎందుకో చిరు మాత్రం సిద్ధంగా లేడు అనిపిస్తుంది.