సినీ నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన విలక్షణమైన నటనతో దేశవ్యాప్తంగా.
గుర్తింపు కలిగిన నటుడు.ఇదే సమయంలో సమాజంలో జరిగే రకరకాల సమస్యలపై తనదైన శైలిలో అభిప్రాయాలు తెలియజేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఈ క్రమంలో బీజేపీ పై ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించటం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశానికి మత రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు.ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలో నేను కూడా ఓ పాత్ర చేస్తున్నాను.
ఈ క్రమంలో బీజేపీ( BJP )తో పొత్తు ఎందుకు పెట్టుకున్నావని అడిగాను.ఏపీలో బీజేపీ ఓటు శాతం ఎంత ఉంది.? మోదీతో పొత్తు ఏంటని ప్రశ్నించాను.పొత్తుకు కారణాలు ఉన్నాయని పవన్ తెలియజేశారు.
మీరు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.కానీ మీలాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
అయితే మోదీతో ఉంటే పవన్ కళ్యాణ్ కి నేను ఓటు వేయను… అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో తన స్నేహితుడు గౌరీ లంకేష్ ను హత్య చేయటంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వ్యాఖ్యానించారు.