ఘనంగా నేడు మంచు మనోజ్ మౌనిక సంగీత్ వేడుకలు!

మంచు వారింట పెళ్లి భాజలు మోగుతున్నాయి.గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మనోజ్ రెండో పెళ్లి వార్తలు నిజమయి మార్చి మూడవ తేదీ మనోజ్ భూమా మౌనిక రెడ్డితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు.

 Manchu Manoj Maunika Sangeet Celebrations Today, Manchu Manoj, Maunika ,sangeet-TeluguStop.com

ఇప్పటికే మనోజ్ ఇంట పెళ్లి వేడుకలు మొదలైన విషయం మనకు తెలిసిందే.ఇక నిన్న మెహందీ వేడుకలతో ప్రారంభమైన ఈ వేడుకలు నేడు సంగీత కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నారు.

ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ మనోజ్ పెళ్లి వేడుకలలో ఎంతో బిజీగా ఉండిపోయారు.

ఇకపోతే మనోజ్ మౌనికల పెళ్లి వేడుకలను మంచు లక్ష్మి ఇంటి వద్ద ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడం ఇష్టం లేనటువంటి మోహన్ బాబు విష్ణు ఈ పెళ్లికి దూరంగా ఉండడంతో తన తమ్ముడి ప్రేమకు మద్దతు తెలుపుతూ మంచు లక్ష్మి ఈ పెళ్లి వేడుకలను తన ఇంట్లో నిర్వహిస్తున్నట్లు సమాచారం.మహా మంత్ర పూజతో మంచు లక్ష్మి తన తమ్ముడి మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించారు.

ఈ క్రమంలోనే హల్దీ మెహందీ వేడుకలు పూర్తికాగా నేడు సంగీత్ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నారు.

ఇక మనోజ్ ఇదివరకే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని తనకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నటువంటి మనోజ్ మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉన్నారు.అయితే వీరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ బయటపడటంతో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ మార్చి మూడవ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు.ఇకపోతే వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.ఇదివరకే మౌనిక రెడ్డి ఒక వ్యక్తిని వివాహం చేసుకొని ఆయనకు విడాకులు ఇచ్చి తిరిగి మనోజ్ ను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.ఇదివరకే ఈమెకు ఓ కుమారుడు కూడా ఉండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube