కమల్ అహ్మద్ అనే యువకుడు ఎంఐ ఫోన్లకు వీర అభిమాని.సెప్టెంబర్ లో షావోమి కంపెనీ ఎంఐ10టి ప్రోను అనే స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది.
ఆ ఫోన్ పై మనసు పారేసుకున్న కమల్ ఆ ఫోన్ కొనే వరకు పెళ్లి చేసుకొను అని నిర్ణయించుకున్నాడు.ఈ విషయం సోషల్ మీడియా ద్వారా షావోమి కంపెనీకి తెలిసింది.
చాలా మంది పెళ్లి చేసుకోకపోవడానికి అనేక రకాల కారణాలు చెబుతారు.కానీ కమల్ మాత్రం ఆ ఫోన్ కన్నా తర్వాతే పెళ్లి చేసుకుంటా అనేసరికి షావోమి అధికార ప్రతినిది ఒక్కరు వెంటనే రెస్పాండ్ అయ్యి… ఎంఐ10టి ప్రోను ఉచితంగా అందించాడు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అవును కమల్ ఆ ఫోన్ ఉచితంగా సాదించాడు.
షావోమి కంపెనీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.అదేవిదంగా ఆ ఫోన్ ను పొందేందుకు అతను ఓ కూపన్ ను సాదించడంతో ఎంఐ10టి ప్రోను ఉచితంగా పొందాడు అన్నాడు.
ఆ ఫోన్ కొనేందుకు కమల్ ఆల్రెడీ డబ్బులు కూడా సేవ్ చెయ్యడం స్టార్ట్ చేశాడు అంట.కమల్ అహ్మద్ ట్విటర్ ద్వారా నేను ఎంఐ10టి ప్రోను ఉచితంగా సాదించను అంటూ మెసేజ్ పెట్టాడు.ఇక నైనా పెళ్లి చేసుకుంటావనుకుంటా అంటూ షావోమి ఇండియన్ హెడ్ మనుకుమార్ జైన్ సరదాగా ట్వీట్ చేశాడు.