క్రేజీ కాంబో : 'సలార్'లో మలయాళ స్టార్.. డార్లింగ్ కు తగ్గ నటుడే.. ఎవరంటే?

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

 Malayalam Actor Prithviraj In Talks For Salaar Details, Prabhas, Salaar, Prashan-TeluguStop.com

ఇక ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తునాన్రు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళం స్టార్ నటుడు కూడా భాగం కానున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో మలయాళ యాక్టర్ పృథ్వీ రాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని ఈ సినిమా ప్రకటించిన కొత్తలో స్ట్రాంగ్ బజ్ వినిపించింది.

ఈ వార్తపై మళ్ళీ రూమర్స్ రాలేదు.తాజాగా ఈ నటుడు ఈ వార్త నిజమే అని కెజిఎఫ్ 2, కరోనా కంటే ముందే ఈ సినిమా కథ విని ఓకే చెప్పానని తెలిపాడు.

Telugu Salaar, Malayalam, Prabhas, Prashanth Neel, Prithviraj, Pruthvi Raj-Movie

కానీ ప్యాండమిక్ కారణంగా డేట్స్ తారుమారు కావడంతో ఈ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.అయితే ఇంకా ఈ సినిమా కేవలం 35 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ తన డేట్స్ అడ్జెస్ట్ చేస్తానని.ప్రభాస్ డేట్స్ తన డేట్స్ సెట్ అయ్యేలా ఉన్నాయని అందుకే ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని క్లారిటీ ఇవ్వడంతో ఈ క్రేజీ కాంబోపై ఇప్పుడు ఉత్కంఠ ఏర్పడింది.మరి ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందో లేదో.

ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube