అర్జున్ కపూర్ పై ఘాటుగా ట్రోల్స్.. ప్రేమ పక్షులు ఫైర్.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రేమ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా గురించి మనందరికీ తెలిసిందే.ఈ జంట గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.

 Malaika Arora Response Trolls Who Criticize Arjun Kapoor Fitness And Body Shape-TeluguStop.com

ఇకపోతే ఈ లవ్ బర్డ్స్ తరచూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు.మరీ ముఖ్యంగా ట్రోల్స్ విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

అయితే అర్జున్ కపూర్, మలైక అరోరా మధ్య 12 ఏళ్ళ వ్యత్యాసం ఉన్న విషయం తెలిసిందే.అంతేకాకుండా మలైకా అరోరా కి ఇదివరకే పెళ్లయి విడాకులు కూడా అయిన విషయం తెలిసిందే.

ఈ జంట ఎక్కువగా వయస్సు విషయంలో ట్రోల్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి ఈ జంటను టార్గెట్ చేశారు నెటిజన్స్.

అయితే ఎప్పుడు మలైకా అరోరా ని టార్గెట్ చేసే నెటిజెన్ తాజాగా కాస్త రూటు మార్చి అర్జున్ కపూర్ పై విమర్శల దాడి చేశారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో కాస్త బరువెక్కిన అర్జున్ కపూర్ ప్రతిరోజు జిమ్లో వర్కవుట్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను ఇంస్టాగ్రామ్ విధంగా పంచుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా వర్క్ అవుట్ కి సంబంధించిన వీడియోని షేర్ చేయగా ఓ ఆకతాయి నెటిజన్‌ ఇలా కామెంట్‌ చేశాడు.ఇలాంటి క్లయింట్‌ ఉండటం మీ అదృష్టం.

ఎందుకంటే నిత్యం మీకు డబ్బలు వస్తూనే ఉంటాయి.తరచూ అతను వర్కౌట్స్‌ చేస్తూనే ఉంటాడు.

కానీ ఎప్పటికీ సరైన షేప్‌ను పొందలేడు అంటూ ఓ నెటిజన్‌ అర్జున్‌పై కౌంటర్‌ వేశాడు.ఇది చూసిన అర్జున్‌ ఆ కామెంట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి అతడికి రీకౌంటర్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఫిట్‌నెస్‌ అంటే బాడీ మీద కట్స్‌ కనిపించడం, సిక్స్‌ ప్యాక్‌తో కూడిన షేప్‌ ఉండటం అనుకుంటున్నారు.ఎలా అంటే ఫేస్‌ లేని బాడీ డీపీలా అని రాసుకొచ్చాడు.

కానీ నా దృష్టిలో ఫిట్‌నెస్‌కు అసలు అర్థమేంటంటే ఏ వ్యక్తి అయితే ఎలాంటి చింతలు లేకుండా ప్రతి రోజు సాధారణ ఆరోగ్యకరమైన.ప్రశాంతమైన జీవితాన్ని జీవించడం.సైలెంట్‌గా తన జీవితం తాను గడిపేవాడు.తన గురించి తాను మాత్రమే శ్రద్ధ తీసుకునేవాడే ఫిట్‌గా ఉన్నట్లు.అంతేకాని మోహం చాటేసిన డీపీలా ఉండటం కాదు అంటూ కాస్త ఘాటూ రిప్లై ఇచ్చాడు అర్జున్ కపూర్.ఇది చూసిన అర్జున్‌ ప్రియురాలు మలైకా అతడికి మద్దతుగా నిలిస్తు అర్జున్‌ ఇన్‌స్టా స్టోరీని స్క్రిన్‌ షాట్‌ తీసి బాగా చెప్పావ్‌ అర్జున్‌.

ఇలాంటి విమర్శలు, ట్రోల్స్‌ నీ కాంతిని దూరం చేయకూడదు.నీ ప్రయాణంలో నీకు మరింత ధైర్యం, శక్తి రావాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube