కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.
ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఈయన సినిమాలకు మన తెలుగులో కూడా మార్కెట్ ఉంది.
ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన పాన్ ఇండియా సినిమా చేయక పోయిన ఈయనకు అంతటా ఫ్యాన్స్ ఉన్నారు.
అంతలా ఈయన అభిమానులను సంపాదించారు.మరి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది.
ఇది ఆలోచిస్తేనే మైండ్ బ్లాంక్ అవుతుంది.వీరిద్దరూ ఒకే తెరమీద కనిపిస్తే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయం.
మరి అలాంటి తరుణం రాబోతుంది అంటున్నారు.ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది.ఒకరి స్టార్ హీరో సినిమాలో మరొకరు నటిస్తూ సినిమాలకు మరింత క్రేజ్ తెస్తున్నారు.ఒకరి సినిమాలో ఒకరు కీలక పాత్రల్లో కానీ గెస్ట్ రోల్స్ లో కానీ నటిస్తూ హీరోలు మొత్తం ఒకటే అన్నట్టు చెబుతున్నారు.
అలా మల్టీ స్టారర్ గా తెరకెక్కే సినిమాలకు క్రేజ్ కూడా బాగానే ఏర్పడుతుంది.
![Telugu Dil Raju, Kollywood, Mahesh Babu, Maheshbabu, Thalapathy, Thalapathyvijay Telugu Dil Raju, Kollywood, Mahesh Babu, Maheshbabu, Thalapathy, Thalapathyvijay](https://telugustop.com/wp-content/uploads/2022/06/mahesh-babu-to-act-with-vijay-Thalapathy-66-movie-detailss.jpg)
మరి అలాంటి సెన్సేషనల్ కాంబో ఒకటి సెట్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.విజయ్ దళపతి, మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా సెట్ చేయనున్నారని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.మరి ఈ క్రేజీ కాంబో ను సెట్ చేయబోతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా.
వంశీ పైడిపల్లి. అవునూ ఈయనే వీరిద్దరి కాంబోలో మూవీ సెట్ చేస్తున్నట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి.
![Telugu Dil Raju, Kollywood, Mahesh Babu, Maheshbabu, Thalapathy, Thalapathyvijay Telugu Dil Raju, Kollywood, Mahesh Babu, Maheshbabu, Thalapathy, Thalapathyvijay](https://telugustop.com/wp-content/uploads/2022/06/mahesh-babu-to-act-with-vijay-Thalapathy-66-movie-detailsa.jpg)
ప్రెసెంట్ విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.దిల్ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో మహేష్ చిన్న రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది.మరి ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ వార్తకే ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.