బలపరీక్షకు ముందే రాజీనామా చేసేసిన మహారాష్ట్ర సీఎం..!!

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు.అసెంబ్లీ బలపరీక్షకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.

ఈ నిర్ణయం తీసుకున్నారు.రెబల్ ఎమ్మెల్యేలు ఎలాగో మద్దతు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో… ఇవాల్టి క్యాబినెట్ భేటీలోనే సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఉద్ధవ్ థాకరే.

అసెంబ్లీలో బలపరీక్షకి ముందుగానే ఇప్పుడే తప్పుకోవటం ఉత్తమమని భావించి సీఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

Telugu Cmuddhav, Maharashtra, Shiva Sena, Suprem-Telugu Political News

సుప్రీం ఆదేశాల మేరకు గురువారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో… మరోపక్క రెబెల్ ఎమ్మెల్యేలు మద్దతు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవటంతో.ఉద్ధవ్ థాకరే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్ధవ్ థాకరే బల పరీక్షకు సంబంధించి శివసేన పార్టీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు సుదీర్ఘంగా వాదనలు సాగాయి.

ఈ క్రమంలో రాత్రి 9 గంటలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే బలపరీక్షకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… మహారాష్ట్రలో ఒక్కసారిగా రాజకీయం మారటంతో.ఉద్ధవ్.

ముందుగానే రాజీనామా చేయటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube