బూటకపు ఎన్‌కౌంటర్లకు 'చంద్రు'లే బాధ్యులు

తెలంగాణలో జరిగిన వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్, ఏపీలో తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఇరవై మంది ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్‌కు ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు బాధ్యత వహించాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎంఎల్‌) మావోయిస్టు కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.ఇవి రెండూ బూటకపు ఎన్‌కౌంటర్లని తేల్చిచెప్పింది.

 Maoists Flay Fake Encounters In Ap, Telangana-TeluguStop.com

మావోయిస్టు పార్టీ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ కమిటీ అధికార ప్రతినిధి యుగంధర్‌ దేవ్‌ రెండు పేజీల ప్రకటన విడుదల చేశారు.ఎర్రచందనం దొంగలను ఉద్దేశపూర్వకంగానే హతమార్చారని అన్నారు.

పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాలను గుడ్డిగా అనుసరిస్తున్నారని మండిపడ్డారు.మావోయిస్టు పార్టీ సాగిస్తున్న సాయుధ పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఫాసిస్టు, ఫండమెంటలిస్టు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల బతుకులను నాశనం చేస్తోందన్నారు.కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు భూములను కట్టబెడుతూ రైతులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

మొత్తం మీద రెండు రాష్ర్టాల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ల కారణంగా మావోయిస్టులు మళ్లీ తమ చూపులు ప్రభుత్వాలపై సారించారు.వీరు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పలేం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube