పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే స్నేహితులు ఉంటారు.. మధు నందన్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నువ్వు నేను సినిమా ద్వారా పరిచయమయ్యారు నటుడు మధునందన్.నువ్వు నేను సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన పలు సినిమాలలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Madhu Nandan Shocking Comments On Friendship Go Viral , Madhu Nandan, Tollywood,-TeluguStop.com

మధునందన్ ఎక్కువగా నితిన్ నటించిన సినిమాలలో నటిస్తూ ఎంతో గుర్తింపు పొందారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మధు నందన్ సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పరిచయాలు ద్వారానే అవకాశాలు వస్తాయని తెలిపారు.ఇలా పరిచయాలు పెంచుకుంటూనే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉండాలని ఆయన తెలిపారు.

ఇకపోతే మనకు సినిమా అవకాశాలు వచ్చాయని మన స్నేహితుల దగ్గర చెప్పగా వాళ్లు స్నేహితులుగా మంచివాళ్ళలా మన పక్కన ఉంటూనే వెన్నుపోటు పొడుస్తారని ఆయన తెలిపారు.అందుకే సినిమాలలో అవకాశాలు వచ్చిన చాలామంది వెంటనే సినిమా అవకాశం వచ్చిన విషయం ఎవరికీ చెప్పరని తెలిపారు.

Telugu Friendship, Madhu Nandan, Nitin, Shekhar Kammula, Telugu, Tollywood-Movie

మనకు ఫలానా సినిమాలో అవకాశం వచ్చిందని చెబితే మన స్నేహితులు వారి దగ్గరకు వెళ్లి మనకు వచ్చిన అవకాశాన్ని కూడా రాకుండా చేస్తారని, అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని ఆయన తెలిపారు.ఇకపోతే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చిందని అయితే తనకు శేఖర్ కమ్ముల గారిని కలవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతని ఇంతవరకు కలవలేక పోయానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మధునందన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube