Viral Video: హృదయాల్ని కదిలించే వీడియో.. ఆ పాప ఏం చేసిందంటే..

అదో స్టేడియం.అక్కడ డాగ్ షో జరుగుతోంది.అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.చాలా మంది తము ఇష్టంగా పెంచుకున్న శునకాలను తీసుకువచ్చారు.

 Look At What This Judge Did For A Specially Abled Girl In The Dog Show Details,-TeluguStop.com

వాటితో నిర్వహించే ప్రదర్శన కోసం చాలా మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అయితే అదే సమయంలో అక్కడికి ఓ చిన్నారి వచ్చింది.

తన వెంట తన బుజ్జి కుక్క పిల్ల కూడా ఉంది.

ఆ బుజ్జి పాప, తనతో పాటు స్టేడియానికి వచ్చిన బుచ్చి కుక్క పిల్లను అక్కడే ఉన్న జడ్జీ చూశాడు.

తనతో ఏదో మాట్లాడాడు.బహుశా.

ఈ ప్రదర్శనకు నువ్వూ, నీ బుజ్జి కుక్క పిల్ల సిద్ధంగా ఉన్నారా.అంతా మీ ప్రదర్శన కోసమే ఎదురుచూస్తున్నారు అని చెప్పాడనుకుంటా.

చిన్నారి పాప మేము రెడీగా ఉన్నాం.చాలా ఉత్సాహంగా ఉంది.

ఇప్పుడు మేమేం చేయాలని అడిగినట్టుగా ఉంది.అలా నువ్వు, నీ పప్పీ పరుగెత్తుకు రండి అని చెప్పడమే ఆలస్యంగా.

ఆ బుజ్జాయి తన కుక్క పిల్లను పట్టుకుని చుట్టూ పరుగెత్తింది.ఆ తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు.

తర్వాత కన్నీళ్లు తుడుచుకున్నారు.

అదేంటి కన్నీళ్లు తుడుచుకోవడం ఎందుకు అనుకుంటున్నారా.

ఎందుకంటే ఆ పాపాయి ఆటిజం తో బాధపడుతుంది.ఆ చిన్నారి తీసుకువచ్చిన పప్పీ నిజమైనది కాదు.

ఓ బొమ్మ.తనకు నిజమైన కుక్క పిల్లకు, బొమ్మకు తేడా తెలియదు.

కానీ అక్కడికి వచ్చింది.అప్పుడు ఆ జడ్జీ వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కదిలించింది.

చిన్న పాపను అక్కడి నుండి వెళ్లగొట్టకుండా.తనను ఎంకరేజ్ చేసేలా చేసిన తీరు చాలా మంది మనసులను గెలుచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube