ఓటమిపై తొలిసారి స్పందించిన ఆర్కే రోజా..!!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ( YCP ) ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే.కేవలం 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది.

 Rk Roja Reacts To The Defeat For The First Time , Ysrcp, Rk Roja , Department Of-TeluguStop.com

దీంతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది.పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలలో ఆర్కే రోజా కూడా ఓడిపోవడం జరిగింది.నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆమె ఓటమిపై తొలిసారి సోషల్ మీడియాలో స్పందించారు.“చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.కానీ మంచి చేసి ఓడిపోయాం.గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం” అని పోస్ట్ చేయడం జరిగింది.కాగా నగరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ 45 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

నగరి నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికలలో రెండుసార్లు రోజా గెలవడం జరిగింది.2019లో జగన్ ( Jagan )ప్రభుత్వం వచ్చిన సమయంలో మంత్రిగా కూడా రాణించటం జరిగింది.పర్యాటకశాఖ, క్రీడా శాఖ ( Department of Tourism, Department of Sports )మంత్రిగా రాణించారు.అయితే మూడోసారి గెలవాలని రోజా కృషి చేయగా తెలుగుదేశం గెలవడం జరిగింది.

దీంతో ఫలితాలు వచ్చినా అనంతరం ఓటమి చెందిన నేతలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు.ఒకపక్క అధినేత వైయస్ జగన్ ని కలుస్తూ మరోపక్క కార్యకర్తలకు భరోసా ఇస్తూ ప్రకటనలు చేస్తున్నారు.

ఈ రకంగానే తన ఓటమిపై ఆర్కే రోజా సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube