మంత్రి పవన్ కళ్యాణ్ పై హీరో మంచు మనోజ్ సంచలన పోస్ట్..!!

ఏపీ మంత్రులకు( AP Ministers ) నేడు శాఖలు కేటాయించారు.ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించడం జరిగింది.

 Hero Manchu Manoj Sensational Post On Minister Pawan Kalyan , Manchu Manoj, Pawa-TeluguStop.com

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖలు రావటంతో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్( Manchu Manoj ) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

“శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అఫ్ ఆంధ్ర ప్రదేశ్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకి మంత్రిగా నియమితులైనందుకు సంతోషంగా ఉంది.మెరుగైన సమాజం కోసం మీ నిర్విరామ అంకితభావం, నిబద్ధతకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి.

ప్రొడక్టివ్, ఎఫెక్టివ్ పాలన రావాలని కోరుకుంటున్న.వెల్కమ్ చీఫ్” అని మంచు మనోజ్ పోస్ట్ పెట్టడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు.అదేవిధంగా జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల గెలవడంలో కీలకంగా రాణించారు.

దీంతో ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు శాఖలు కేటాయించటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube