మంత్రి పవన్ కళ్యాణ్ పై హీరో మంచు మనోజ్ సంచలన పోస్ట్..!!
TeluguStop.com
ఏపీ మంత్రులకు( AP Ministers ) నేడు శాఖలు కేటాయించారు.ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించడం జరిగింది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖలు రావటంతో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్( Manchu Manoj ) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
"""/" /
"శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అఫ్ ఆంధ్ర ప్రదేశ్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకి మంత్రిగా నియమితులైనందుకు సంతోషంగా ఉంది.
మెరుగైన సమాజం కోసం మీ నిర్విరామ అంకితభావం, నిబద్ధతకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.
మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి.ప్రొడక్టివ్, ఎఫెక్టివ్ పాలన రావాలని కోరుకుంటున్న.
వెల్కమ్ చీఫ్" అని మంచు మనోజ్ పోస్ట్ పెట్టడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు.
అదేవిధంగా జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల గెలవడంలో కీలకంగా రాణించారు.
దీంతో ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు శాఖలు కేటాయించటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!