ఏదో ఒక రోజు చరణ్ కి బాకీ పడిన మొత్తం ఇచ్చేస్తాను : నాగబాబు 

నాగబాబు రుద్రవీణ సినిమాతో అంజన ప్రొడక్షన్ ( Anjana Production )అనే ఒక బ్యానర్ ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా మారారు అప్పటినుంచి ఆయన ప్రతి సినిమాలోని చిరంజీవి నటిస్తూ వచ్చారు.అయితే 2010లో ఆయన చివరగా ఆరంజ్ సినిమా( Orange movie ) నిర్మించి తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి ఇక నిర్మాణం నుంచి తప్పుకున్నారు.

 Nagababu About Orange Movie And Other Problems, Anjana Production , Nagababu ,-TeluguStop.com

అంతకుముందు అనేక సినిమాలను నిర్మించిన నాగబాబు ఈ సినిమా ఫెయిల్యూర్ అవ్వడానికి పూర్తి బాధ్యత తను నమ్మిన మనుషులు, అలాగే తాను కూడా సినిమాని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే అంటారు.మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ కి చాలా పాపులారిటీ వచ్చేసింది దాన్ని నాగబాబు సరిగ్గా వాడుకోలేకపోయాడు అనేది కొంతమంది వాదన.

Telugu Anjana, Nagababu, Nagababuorange, Orange, Pawan Kalyan, Ram Charan, Rudra

ఏది ఏమైనా ఈ సినిమా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువగా పెరిగిపోవడం మొదటగా చెప్పుకోవాల్సిన విషయం.దానికి చేసిన అప్పులు తీరాలంటే తన మొత్తం ఆస్తి అమ్మినా కూడా 10% అప్పులను కూడా తీర్చలేనని నాగబాబుకు అర్థమయిపోయి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారట.కానీ ఇంక అప్పటి వరకు ఎవరికీ తనకు అప్పులు పెరిగిపోయాయి అనే విషయం ఎవరికి చెప్పుకోలేదట.నాలుగు రోజుల తర్వాత చిరంజీవికి విషయం తెలిసి ఇంటికి పిలిపించుకొని నేనున్నాను ఏం టెన్షన్ పడకు అని చెప్పారట.

అలాగే ఎక్కడో వేరే దేశంలో షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా ఫోన్ చేసి జరిగిన దాన్ని మర్చిపో అన్నయ్య నేనున్నాను అని చెప్పారట.ఇలా వారిద్దరూ ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ బ్రతుకుపై ఆశ పెంచుకున్నారు.

Telugu Anjana, Nagababu, Nagababuorange, Orange, Pawan Kalyan, Ram Charan, Rudra

చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నాగబాబు కున్న అప్పులు మొత్తం తీర్చారట.అప్పులయితే తీరిపోయాయి కానీ భవిష్యత్తు ఎలా ? రేపటి రోజుకు డబ్బు కావాలి అంటే మళ్ళీ ఎవరిని అడగాలి అని అనుకున్న సమయంలో టీవీ తను ఆదుకుంది అంటారు నాగబాబు.జబర్దస్త్ తో పాటు కొన్ని సీరియల్స్ కూడా ఐదారేళ్లలో తనను పూర్తిస్థాయిలో నిలబెట్టి మంచి పాపులర్ అయ్యేలా చేశాయి అన్నారు.అలాగే ఆరెంజ్ సినిమా కోసం కేవలం 50% మాత్రమే ముందుగా అడ్వాన్స్ ఇచ్చారట రామ్ చరణ్( Ram Charan ) కి.ఇప్పటికీ ఆ 50% బాకీ ఉన్నాడట.ఏదో ఒక రోజు ఖచ్చితంగా తన బాకీ తీర్చేస్తాను అంటున్నారు నాగబాబు.

అలాగే చాలామంది అన్నదమ్ముల కన్నా స్నేహితులే బెటర్ అని అంటుంటారు కానీ తన మట్టుకు మాత్రం ఎప్పుడూ తన అన్న మరియు తమ్ముడు తన ప్రాణం అని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube