ఆ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న సమంత.. అక్కడ సక్సెస్ కావడం సాధ్యమేనా?

స్టార్ హీరోయిన్ సమంతకు ( Samantha )సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సమంతకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 35.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.తెలుగు, తమిళ భాషల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సమంత ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ ( Family Man 2 web series )తో హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు.

 Star Heroine Samantha Green Signal For One More Movie Details Here , Samantha,-TeluguStop.com

అయితే మలయాళం ఇండస్ట్రీలో సమంత ఎంట్రీ ఇస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ( Mammootty )సినిమాలో సమంత కీలక పాత్రలో నటిస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం మమ్ముట్టి, సమంత కలిసి ఒక యాడ్ లో నటించగా ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తుండటం గమనార్హం.మమ్ముట్టి ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం.

సమంత మలయాళ ఇండస్ట్రీలో సైతం ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.రీఎంట్రీలో సమంత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.సమంత మయోసైటిస్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని సమాచారం అందుతోంది.మరో 10 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. గౌతమ్ మీనన్( Gautham Menon ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సమంత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుస ప్రాజెక్ట్ లను ప్రకటిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.మా ఇంటి బంగారం అనే మరో సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు.సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

సమంత వయస్సు పెరుగుతున్నా అందంగా కనిపిస్తూ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు.సమంత నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube