పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు.జూన్ 12వ తారీకు పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం.13వ తారీకు ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఐదు అంశాలపై సంతకాలు చేయడం జరిగింది.మొదట డీఎస్సీ నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ₹4000 రూపాయలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైల్ పై సంతకం చేయడం జరిగింది.

 Sensational Decision Of Cm Chandrababu Regarding Polavaram Project , Cm Chandrab-TeluguStop.com

ఆ తర్వాత నేడు మంత్రులతో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో శుక్రవారం వెలగపూడి సచివాలయంలో అని శాఖలపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అధికారులతో సమీక్షలో వాటి స్థితిగతులపై ఆరా తీశారు.పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అంతేకాదు సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.గతంలోనూ 2014లో గెలిచినా అనంతరం సోమవారం పోలవరం అంటూ ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించేవారు.ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు సమీక్షించేవారు.సంబంధిత అధికారులతో మంత్రులతో కలసి ప్రతి నెలలో ఓ సోమవారం పోలవరం సందర్శించేవారు.

కాగా ఇప్పుడు కూడా అదే విధంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడానికి ఆయన రెడీ కావటం జరిగింది.అంతేకాకుండా ఈ నెల 19వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసి వేగవంతంగా పాలన ప్రారంభించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube