సౌత్ ఇండియాలో తమ సొంత భాషల్లో సినిమా రూపు రేఖలు మార్చిన దర్శకులు వీరే !

ఏదో ఒక రోజు ప్రతి సినిమా ఇండస్ట్రీ కూడా మంచి సినిమాలను అందిస్తుంది.భాషతో సంబంధం లేకుండా సరిహద్దులు దాటి పాన్ ఇండియా చిత్రాలుగా అవి కలెక్షన్స్ సునామీని సృష్టిస్తాయి.

 South Indian Directors Who Made First Pan India Movie , Pan India Movie, Bollywo-TeluguStop.com

అయితే ఇది ఇప్పుడు జరుగుతున్న సినిమాలకు వర్తిస్తుందేమో గాని గతంలో ఇలా ఉండేది కాదు.కేవలం బాలీవుడ్( Bollywood ) మాత్రమే దేశంలో గుర్తింపు పొందిన సినిమా పరిశ్రమగా ఉండేది.

మిగతావన్నీ కూడా చాలా నాసి రకం సినిమాలో తీస్తున్నాయి అన్న భావనలో అందరూ ఉండేవారు.అయితే ఇలా భాష భేదం లేకుండా సినిమా పరిశ్రమను దేశం మొత్తం మీద తలెత్తుకునేలా చేసిన కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు.

ఎవరి భాషలో వారు సిద్ధహస్తులుగా ఉండి మంచి సినిమాలను తీసి ఆ భాషను మరో రేంజ్ కి తీసుకెళ్లారు.అలా సౌత్ ఇండియాలో ఉన్న భాషల్లో టాప్ డైరెక్టర్స్ ఎవరు? ఏ సినిమా వాళ్ళ ఆ భాష గౌరవం దేశములో పెరిగింది అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రాజమౌళి

( Rajamouli )

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన భాష గౌరవాన్ని నిలబెట్టింది రాజమౌళి.ఇందులో ఎలాంటి సందేహం లేదు బాహుబలి లాంటి సినిమా తీసి బాలీవుడ్ మెడలు మంచి ఫ్యాన్ ఇండియా గొప్పతనాన్ని తెలుగు వారికి రుచి చూపించారు.

ఆ తర్వాత ఎంతో మంది దర్శకులు అదే తరహా సినిమాలను తెరకెక్కిస్తూ ఒక్కో మెట్టు తెలుగు సినిమా పరిశ్రమను ఎక్కిస్తున్నారు.

Telugu Bollywood, Shankar, Pan India, Prashanth Neil, Rajamouli, Indiandirectors

ప్రశాంత్ నీల్

కన్నడ సినిమా పరిశ్రమ విషయానికొస్తే కేజిఎఫ్ లాంటి ఒక సినిమాతో యావత్ భారతదేశాన్ని తమ వైపు చూసేలా చేసుకున్నారు ప్రశాంత్ నీల్( Prashanth Neil ).ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కి కన్నడ చిత్రాలకు కూడా ఇంతటి ప్రాధాన్యత ఉంటుందా అనేలా చేశారు.ఆ తరహాలోనే మరికొన్ని సినిమాలు వచ్చి ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమ మారిపోయింది.

Telugu Bollywood, Shankar, Pan India, Prashanth Neil, Rajamouli, Indiandirectors

శంకర్

ఇప్పుడు మనం బాహుబలి కే జి ఎఫ్ అని మాట్లాడుకుంటున్నాము.కాని కొన్నేళ్లు వెనక్కి వెళితే రజినీకాంత్ ఐశ్వర్య రాయితో రోబో అనే సినిమాకి దర్శకత్వం వహించి దానిని పాన్ ఇండియా వ్యాప్తంగా తమిళ సినిమా పరిశ్రమ నుంచి మొట్టమొదటి చిత్రాన్ని అందరికీ పరిచయం చేశారు డైరెక్టర్ శంకర్( Director Shankar ).ఆయన తీసిన అనేక సినిమాలు అద్భుతంగా ఉంటాయి.ఇప్పటి వరకు తమిళం కి మాత్రమే ఆయన పరిమితమయ్యారు.

ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాతో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా తీస్తున్నారు.ఇక మలయాళ సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా సూపర్ స్టార్ డైరెక్టర్ గా జీతూ జోసఫ్ పేరు చెప్పుకోవచ్చు.

ఆయన మోహన్ లాల్ తో తీసిన ప్రతి సినిమా ఒక అద్భుతం.అందులో ఈ మధ్యకాలంలో వచ్చిన నెరు సినిమా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube