‘డ్రీమర్ల’ మెడపై బహిష్కరణ కత్తి : చర్యలు చేపట్టండి.. బైడెన్ యంత్రాంగానికి అమెరికా చట్టసభ్యుల లేఖ

43 మంది చట్టసభ సభ్యులతో కూడిన ద్వైపాక్షిక సమూహం 2,50,000కు పైగా ఉన్న డాక్యుమెంటెడ్ డ్రీమర్లను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ( Joe Biden )పరిపాలనా యంత్రాంగాన్ని కోరింది.ఈ డ్రీమర్లలో భారతీయులే అత్యధిక శాతం మంది ఉన్నారు.

 Us Lawmakers Urged Biden Administration To Take Urgent Action To Protect Over 25-TeluguStop.com

అమెరికాలో హెచ్‌–1బీ ( H-1B ), ఇతర దీర్ఘకాలిక నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్‌’లుగా పిలుస్తారు.ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.

అప్పుడు వారు అగ్రరాజ్యాన్ని వదిలి స్వదేశాలకు వెళ్లాల్సి వుంటుంది.ఇలాంటి వారు అమెరికాలో దాదాపు 2,50,000 మంది వరకు వుంటారని అంచనా.

భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా ‘గ్రీన్‌ కార్డు’( Green Card ) కోసం నిరీక్షిస్తున్నారు.ఈ సమయంలో వారి పిల్లల వయసు 21 ఏళ్లు దాటుతోంది.దీంతో అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.డ్రీమర్లు 21 ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్‌లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు.21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్‌ హోదా పోతుంది.వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి చిన్నారులుగా అగ్రరాజ్యం వచ్చిన భారతీయులే ఉన్నారు.

Telugu Green, Joe Biden, Alex Padilla, Lawmakersurged-Telugu NRI

అమెరికాలో చట్టపరమైన హోదాతో పెరుగుతున్నప్పటికీ దీర్ఘకాలిక వలసదారుల పిల్లలు 21 ఏళ్లు నిండినప్పుడు .పెద్దలపై ఆధారపడే స్థితిని కోల్పోతారు.వారి ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మారనిపక్షంలో అమెరికాను విడిచిపెట్టడం తప్పించి వేరే మార్గం లేదని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌకి రాసిన లేఖలో చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Telugu Green, Joe Biden, Alex Padilla, Lawmakersurged-Telugu NRI

వారి కుటుంబాలు స్టేటస్ అప్లికేషన్‌ల సర్దుబాటు కారణంగా శాశ్వాత నివాస స్థితిని పొందకుండా నిరోధించడం వలన విస్తృతమైన బ్యాక్‌లాగ్‌లను ఎదుర్కొంటున్నారని చట్టసభ సభ్యులు ప్రస్తావించారు.ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం, సరిహద్దు భద్రతపై సెనేట్ జ్యుడీషియరీ సబ్‌కమిటీ చైర్ అయిన సెనేటర్ అలెక్స్ పాడిల్లా, ప్రతినిధుల సభ సభ్యుడు డెబోరా రాస్‌లు ఈ లేఖ రాసిన వారికి నాయకత్వం వహించారు.ఈ పిల్లలంతా అమెరికాలోనే పెరుగుతారు, అమెరికా విద్యా వ్యవస్థలోనే విద్యను అభ్యసిస్తారని చట్టసభ సభ్యులు పేర్కొన్నారు.

అయినప్పటికీ దీర్ఘకాలిక గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్ కారణంగా వలసదారుల కుటుంబాలు తరచుగా శాశ్వత నివాస హోదా కోసం దశాబ్ధాలుగా వేచి ఉండిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube