వైరల్ అవుతున్న మహేష్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు.. హీరోగా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మహేష్ బాబు గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి మంచి లాభాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 Mahesh Son Latest Photos Goes Viral In Social Media Details Here , Mahesh Son,-TeluguStop.com

మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) కాంబో మూవీ పై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణకు( Gautam Krishna ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

గౌతమ్ కృష్ణను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.గౌతమ్ కృష్ణ స్విమ్మింగ్ చేస్తున్న, వ్యాయామాలు చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.

నమ్రత సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

గౌతమ్ కృష్ణ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో తెలియాల్సి ఉంది.గౌతమ్ కృష్ణ ఫస్ట్ సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం తెలియాల్సి ఉంది.గౌతమ్ ఇప్పటికే 1 నేనొక్కడినే సినిమాలో నటించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే గౌతమ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

గౌతమ్ కృష్ణ ఫస్ట్ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుందేమో చూడాల్సి ఉంది.గౌతమ్ కృష్ణ భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గౌతమ్ కృష్ణ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

మహేష్ బాబు, గౌతమ్ కృష్ణ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు ఫీలవుతున్నారు.గౌతమ్ కెరీర్ పై మహేష్ ఫోకస్ పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube