సునామీలో టి సైలెంట్ నా ముందు నువ్వు సైలెంట్.. ఈ సినిమాతో శ్రీలీలకు హిట్టొస్తుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల( Srilila ) కెరీర్ పరంగా ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా ఇప్పుడు మాత్రం సరైన ఆఫర్లు లేక కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే శ్రీలీల కెరీర్ కు మళ్లీ ఊపొచ్చింది.

 Will Srileela Got Hit With Robinhood Movie Details Here Goes Viral , Srileela-TeluguStop.com

వరుస ఆఫర్లు శ్రీలీల కెరీర్ కు ఎంతో ప్లస్ అవుతున్నాయి.రవితేజ ( Ravi Teja )హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక కాగా రాబిన్ హుడ్ లో కూడా శ్రీలీల నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది.

ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధించినా శ్రీలీలకు పూర్వ వైభవం రావడం ఖాయమని చెప్పవచ్చు.వరుసగా విజయాలను సొంతం చేసుకోవడం ఏ హీరోయిన్ కు సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.

హీరోయిన్ శ్రీలీల కూడా అందుకు మినహాయింపు కాదు.శ్రీలీల నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆమె యాక్టింగ్ నచ్చక ఫ్లాప్ అయిన సినిమాలు మాత్రం లేవనే సంగతి తెలిసిందే.

రాబిన్ హుడ్( Robin Hood ) గ్లింప్స్ లో శ్రీలీల వెన్నెల కిషోర్ తో “జ్యోతీ.సునామీలో టి సైలెంట్ ఉండాలి నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి” అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.ఈ సినిమాలో నీరా వాసుదేవ్ అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు.శ్రీలీల కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో క్లారిటీ రానుంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల( Venky Kudumula ) డైరెక్షన్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.వరుస విజయాలు అందుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube