టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని( MS Dhoni ) సినీ నిర్మాణం లో అడుగు పెట్టిన విషయం తెల్సిందే.ఆయన నిర్మాణం లో బాలీవుడ్ స్టార్స్ మొదలుకుని టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కూడా నటించేందుకు ఓకే చెప్తారు.
కానీ ఆయన మాత్రం తమిళ్ లో ఒక చిన్న సినిమా ను చేసేందుకు సిద్ధం అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ధోనీ నిర్మాణం లో ఎల్ జీ ఎం అనే సినిమా రాబోతుంది.

ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరోగా హరీష్ కళ్యాణ్( Harish Kalyan ) నటించగా, ఇవానా హీరోయిన్ గా నటించింది.ఇక నదియా ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.ఈ సినిమా ను తమిళంలో రమేష్ తమిళ్ మణి రూపొందించాడు.విభిన్నమైన ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ మూవీ అంటూ యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.తెలుగు లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఆ మద్య ధోనీ భార్య సాక్షి కూడా వచ్చి హైదరాబాద్ లో ప్రచారం చేయడం జరిగింది.

సినిమా లో ఉన్న నటీ నటులు ఎవరికి తెలియదు, కనీసం దర్శకుడు కూడా తెలుగు వారికి పరిచయం లేడు.అయినా కూడా కేవలం ధోనీ నిర్మించిన సినిమా అనే ఉద్దేశ్యంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.తప్పకుండా ఒక సారి ఈ సినిమాను చూడాలి అన్నట్లుగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాకు గాను జే పీ ఆర్ ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ వారు తెలుగు లో విడుదల చేసేందుకు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు.
కేవలం ధోని పేరు చెప్పి సినిమాను అమ్మేశారు.ఇప్పుడు ప్రేక్షకులను కూడా ధోని పేరు చెప్పి థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఎంత ధోని పేరు చెప్పినా సినిమా కంటెంట్ బాగుంటేనే రెండవ రోజు నుండి వసూళ్లు ఉంటాయి అనేది తెల్సిందే.