నాని( Nani ) హీరోగా కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దసర( Dasara ) ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది…శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలను పోసించారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది.ఈ సినిమాతో నాని ఇమేజ్, మార్కెట్ రెండు పెరిగాయి.కానీ, దసర సినిమా శాటిలైట్ రైట్స్ ని ఏ చానెల్ వాళ్ళు కొనడానికి సాహసం చేయడం లేదు అనే విషయం తెలుస్తుంది ఎందుకంటే దసరా సినిమాని ఇప్పటికే ఓ టి టి లో చాలా మంది జనాలు చూశారు.ఇక ఓటీటీల పుణ్యమా అని శాటిలైట్ రైట్స్ కు ఇంతకు ముందులా డిమాండ్ లేదు.
ఆల్రెడీ థియేటర్స్ లో, ఓటిటిలో చూసిన సినిమాలను టీవీల్లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.దీంతో శాటిలైట్ ఛానెల్స్ ఎంత పెద్ద సినిమా అయినా భారీగా కోట్ చేసేందుకు ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే చాలా సినిమాలు శాటిలైట్ రైట్స్ అమ్ముడవక అలా ఉండిపోతున్నాయి.ఇప్పుడు ఈ జాబితాలో దసరా కూడా చేరిందని అంటున్నారు….ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని ఇంకో కొత్త డైరెక్టర్ తో మరో సినిమా ని చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు… అయితే దసర సినిమా శాటి లైట్ రైట్స్ అనేవి ఏ చానెల్ వాళ్ళు తీసుకుంటారో చూడాలి…