క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఈ విషయం తెలుసా? వంద శాతం క్యాష్ బ్యాక్!

రూపే క్రెడిట్ కార్డ్( RuPay Credit Card ) హోల్డర్లకు అదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు.మీరు ఇపుడు 100% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

 Do Credit Card Holders Know This One Hundred Percent Cash Back , Credit Card, L-TeluguStop.com

ఎలా అంటే, దానికోసం మీరు మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ యాప్‌తో లింక్ చేసి, చెల్లింపులు చేయాల్సి ఉంటుంది మరి.దీని తర్వాత మీరు ఈ బంపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందుతారు.ఇది మాత్రమే కాకుండా క్యాష్‌బ్యాక్‌తో పాటు ఉచిత కాఫీ తాగే అవకాశం కూడా ఉందండోయ్.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది.

ఈ ఆఫర్ ప్రకారం, మీరు టాటా గ్రూప్ స్టార్‌బక్స్ ఇండియా ( Tata Group Starbucks India )అవుట్‌లెట్‌లలో యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, రూపే క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపులు చేయాలి.అలా చెల్లిస్తే 100% క్యాష్‌బ్యాక్ పొందుతారు అని సమాచారం.దీనితో పాటు, మీరు ఉచితంగా కాఫీ కూడా అందుతుంది మరి.ఇక్కడ గరిష్ట క్యాష్‌బ్యాక్ పరిమితి అనేది రూ.1000గా వుంది.సదరు క్యాష్‌బ్యాక్ మొత్తం మీ రూపే క్రెడిట్ కార్డ్ ఖాతాకు జమ చేయబడుతుంది.

ఇకపోతే 2022లో, రూపే క్రెడిట్ కార్డ్ యూపీఐ సౌకర్యంతో ప్రారంభించబడింది.ఇప్పుడు మీరు మీ పరిసర దుకాణంలో యూపీఐ క్యూఆర్ కోడ్‌ని( UPI QR code ) స్కాన్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయగలరు.ఇంతకుముందు, యూపీఐ యాప్‌తో బ్యాంక్ ఖాతాను లింక్ చేయడం ద్వారా మాత్రమే చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉండేది.ఇపుడు రుపే క్రెడిట్ కార్డ్‌తో, కూడా మీరు యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చాలా తేలికగా చేయవచ్చును.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube