క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఈ విషయం తెలుసా? వంద శాతం క్యాష్ బ్యాక్!
TeluguStop.com
రూపే క్రెడిట్ కార్డ్( RuPay Credit Card ) హోల్డర్లకు అదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు.
మీరు ఇపుడు 100% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.ఎలా అంటే, దానికోసం మీరు మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ యాప్‌తో లింక్ చేసి, చెల్లింపులు చేయాల్సి ఉంటుంది మరి.
దీని తర్వాత మీరు ఈ బంపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందుతారు.ఇది మాత్రమే కాకుండా క్యాష్‌బ్యాక్‌తో పాటు ఉచిత కాఫీ తాగే అవకాశం కూడా ఉందండోయ్.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది.
"""/" /
ఈ ఆఫర్ ప్రకారం, మీరు టాటా గ్రూప్ స్టార్‌బక్స్ ఇండియా ( Tata Group Starbucks India )అవుట్‌లెట్‌లలో యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, రూపే క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపులు చేయాలి.
అలా చెల్లిస్తే 100% క్యాష్‌బ్యాక్ పొందుతారు అని సమాచారం.దీనితో పాటు, మీరు ఉచితంగా కాఫీ కూడా అందుతుంది మరి.
ఇక్కడ గరిష్ట క్యాష్‌బ్యాక్ పరిమితి అనేది రూ.1000గా వుంది.
సదరు క్యాష్‌బ్యాక్ మొత్తం మీ రూపే క్రెడిట్ కార్డ్ ఖాతాకు జమ చేయబడుతుంది.
"""/" /
ఇకపోతే 2022లో, రూపే క్రెడిట్ కార్డ్ యూపీఐ సౌకర్యంతో ప్రారంభించబడింది.
ఇప్పుడు మీరు మీ పరిసర దుకాణంలో యూపీఐ క్యూఆర్ కోడ్‌ని( UPI QR Code ) స్కాన్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయగలరు.
ఇంతకుముందు, యూపీఐ యాప్‌తో బ్యాంక్ ఖాతాను లింక్ చేయడం ద్వారా మాత్రమే చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉండేది.
ఇపుడు రుపే క్రెడిట్ కార్డ్‌తో, కూడా మీరు యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చాలా తేలికగా చేయవచ్చును.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి5, బుధవారం 2025