Sandy Master : లియో సినిమాలో సైకో విలన్ పాత్రలో నటించి మెప్పించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా?

తమిళ స్టార్ హీరో విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం లియో( leo movie )తాజాగా విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ లభిస్తోంది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

 Leo Movie Choreographer Sandy Master Role Details-TeluguStop.com

అంతేకాకుండా ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇది లోకేష్ విజయ్ స్టాండర్డ్ సినిమా కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే ఈ మూవీ ప్రారంభం సన్నివేశాల్లో సైకో కిల్లర్‌గా ఒక కుర్రాడు చేశాడు.

ఉన్నంతలో తన యాక్టింగ్‌తో భయపెట్టేశాడు.చెప్పాలంటే వణికించేశాడు.అతను ఎవరు? ఏంటి అన్న వివరాలు లోకి వెళితే…

Telugu Kollywood, Leo, Role, Sandy Master, Trisha, Vijay-Movie

ఇక మూవీ మొదట్లో కనిపించేది కాసేపే అయినా సైకో కిల్లర్ పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది.అది చేసింది స్టార్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్( Sandy master ).తమిళంలో కొరియోగ్రాఫర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్న శాండీ మాస్టర్ కొన్ని సినిమాల్లో కామెడీ తరహా రోల్స్ కూడా చేశాడు.కానీ లియో మూవీలో మాత్రం సైకో కిల్లర్ పాత్రలో వణికించేశాడు.హీరోతో తలపడే సీన్‌లో చాక్లెట్ కాఫీ అని రచ్చ లేపాడు.2005లో మానాడా మయిలాడా అనే డ్యాన్స్ షోతో కెరీర్ ప్రారంభించిన ఇతను అదే షో హోస్ట్ చేసిన కాలా మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు.2014లో ఆహ్ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Telugu Kollywood, Leo, Role, Sandy Master, Trisha, Vijay-Movie

ఆ తర్వాత ఏడాదే ఇవనుక్కు తన్నిళ్ల గండం అనే మూవీతో నటుడు కూడా అయిపోయాడు.అప్పటినుంచి ఇప్పటివరకు ఓ 20కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాడు.రజనీకాంత్, విశాల్ తదితర సినిమాలకు పనిచేశాడు.

అంతేకాకుండా సినిమాలలో కామెడీ తరహా పాత్రలలో విలన్ పాత్రల్లో నటిస్తూ నటుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా విడుదలైన ఈ లియో సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube