సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కుడి కాలికి గాయమైంది.
మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా రాయలచెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు కు చేరుకున్నారు.అక్కడి నుండి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు.
కొండ నుండి దిగే సమయంలో కుడి కాలు బెణికింది.కాలుకు వాపు రావడంతో పైకి లేవలేక అక్కడే కూర్చున్నారు.
అదే సమయంలో చెరువు కట్ట ను పరిశీలించేందుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
అక్కడే కూర్చుని ఉన్న నారాయణను పలకరించారు.
కాలు బెణికిన విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి గాయాన్ని పరిశీలించారు.ఫిజియోథెరపీ చేసిన అనంతరం తాత్కాలికంగా కట్టు కట్టారు.
తదుపరి చికిత్సకోసం కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తన వాహనంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.నారాయణ పర్యటనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాధ్, కార్యవర్గ సభ్యులు ఎం.డి.ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంజుల, నదియ, విజయ, ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్, నగర కార్యదర్శి వెంకటేష్, ఓటేరు శాఖా కార్యదర్శి పద్మనాభ రెడ్డి, అభ్యుదయ వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ భాస్కర్, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.