ఆనంద‌య్య మందును అడ్డుకుంటుంది వారే.. న్యాయ‌వాది కీలక వ్యాఖ్యలు.. ?

కరోనా మహమ్మారికి మందు అంటూ వెలుగులోకి వచ్చిన ఆనందయ్య ఔష‌ధం ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా ఈ వ్యవహారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు మెట్లు కూడా ఎక్కింది.

 Anandaiah, Corona Medicine, Lawyer, Key Remarks, High Court,latest News-TeluguStop.com

అదీగాక ఆనందయ్య కరోనా మందు పై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఈ మందు పై ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని తెల‌పాల‌ని హైకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉండగా ఆనందయ్య మందును అడ్దుకోవడానికే ఇన్ని రోజుల నుండి ఈ మందు పంపిణి పక్రియను ఆపారని ప్రజలనుండి వాదన వినిపిస్తుండగా, ఈ మందు తీసుకున్న 130 మంది ఆసుప‌త్రిలో చేరినట్లుగా ప్రచారం జరుగుతుందట.

ఈ విషయంలో ఆనందయ్య తరపున న్యాయవాది మాట్లాడుతు ఈ మందు వల్ల 130 మంది ఆసుప‌త్రి లో చేరితే కేసు ఎందుకు పెట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు.

అంతే కాకుండా ప‌లు ఫార్మా సంస్థలు ఆనందయ్య పై ఒత్తిడి తీసుకువ‌స్తు ఔష‌ధాన్ని పంపిణీ చేయ‌కుండా అడ్డుకుంటున్నార‌ని పేర్కొన్నారు.ఈ వాదనలు విన్న హైకోర్టు విచార‌ణ‌ను ఈ రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వాయిదా వేసింది.

ఇకపోతే ఈ కరోనా మందు పట్ల మెడికల్ మాఫియా తీవ్రంగా స్పందిస్తుందన్న విషయం ఆదినుండి ప్రచారం జరుగుతున్నదే అని అనుకుంటున్నారట ప్రజలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube