ఆనందయ్య మందును అడ్డుకుంటుంది వారే.. న్యాయవాది కీలక వ్యాఖ్యలు.. ?
TeluguStop.com
కరోనా మహమ్మారికి మందు అంటూ వెలుగులోకి వచ్చిన ఆనందయ్య ఔషధం ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లు కూడా ఎక్కింది.అదీగాక ఆనందయ్య కరోనా మందు పై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఈ మందు పై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలపాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఆనందయ్య మందును అడ్దుకోవడానికే ఇన్ని రోజుల నుండి ఈ మందు పంపిణి పక్రియను ఆపారని ప్రజలనుండి వాదన వినిపిస్తుండగా, ఈ మందు తీసుకున్న 130 మంది ఆసుపత్రిలో చేరినట్లుగా ప్రచారం జరుగుతుందట.
ఈ విషయంలో ఆనందయ్య తరపున న్యాయవాది మాట్లాడుతు ఈ మందు వల్ల 130 మంది ఆసుపత్రి లో చేరితే కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
అంతే కాకుండా పలు ఫార్మా సంస్థలు ఆనందయ్య పై ఒత్తిడి తీసుకువస్తు ఔషధాన్ని పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది.
ఇకపోతే ఈ కరోనా మందు పట్ల మెడికల్ మాఫియా తీవ్రంగా స్పందిస్తుందన్న విషయం ఆదినుండి ప్రచారం జరుగుతున్నదే అని అనుకుంటున్నారట ప్రజలు.
వార్2 సినిమా గురించి క్రేజీ అప్ డేట్ వైరల్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అలా ఉంటుందా?