చిత్ర పరిశ్రమలోనే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళల పట్ల లైంగిక వేధింపులకు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే చిత్ర పరిశ్రమలో( Movie Industry ) ఈ వేధింపులు కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పాలి అందుకే చిత్ర పరిశ్రమలో తరచూ ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ విధంగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మొదలుకొని హీరోయిన్స్ సింగర్స్ కొరియోగ్రాఫర్ల వరకు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారని చెప్పాలి .అయితే ఈ విషయాలను స్వయంగా సెలబ్రిటీలు ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారందరూ కూడా కెరియర్ మొదట్లో ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch)ఎదుర్కొన్నామని పలు సందర్భాలలో తెలియజేస్తూ వచ్చారు.హీరోయిన్స్ మాత్రమే కాకుండా సింగర్లు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తాజాగా సింగర్ ప్రణవి( Pranavi ) ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు తనని కూడా కెరియర్ మొదట్లో కమిట్మెంట్స్ అడిగారనీ ఈమె తెలియజేశారు.
సింగర్ ప్రణవి మాత్రమే కాకుండా గీతామాధురి(Geetha Madhuri) కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని తెలుస్తుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి గీతామాధురి ప్రస్తుతం పలు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించారు.ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి ఈమె నటుడు నందు(Nandhu)ని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇకపోతే స్టార్ సింగర్ గా కొనసాగినటువంటి గీతామాధురి కెరియర్ మొదట్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈమెకు తెలుగులో పాటలు పాడే అవకాశాలు రావాలి అంటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్( Tollywood Director ) తన కోరిక తీర్చాలి అంటూ నేరుగా అడిగారట మొదటి నుంచి ఇలాంటి వాటిని ఎంతో ఖండించే గీతామాధురి ఆ డైరెక్టర్ కి కూడా తన స్టైల్ లోనే సమాధానం చెప్పిందని తెలుస్తుంది.డైరెక్టర్ ఇలా అడగడంతో ఆ డైరెక్టర్ కు బుద్ధొచ్చేలా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పడంతో ఆ డైరెక్టర్ తిరిగి ఎప్పుడూ కూడా గీతామాధురి వంక చూడలేదని తెలుస్తోంది.ఇలా ఆ డైరెక్టర్ కి గీతామాధురి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఎవరు కూడా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయలేదట.

ఈ విధంగా మొదటి నుంచి ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటూ చాలా స్ట్రిక్ట్ గా ఈమెకు ఇండస్ట్రీలో మంచి రెస్పెక్ట్ కూడా ఇస్తారని తెలుస్తోంది.ఇలా గీతా మాధురి కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.