ఇలాంటి పరిస్థితుల్లో పవన్ నెక్స్ట్ వ్యూహం ఏంటి?

జ‌న‌సేన పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్ చార్జులు లేరంటే ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.2014 లో పార్టీ పెట్టిన‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌లేదు.టీడీపీ- బీజేపి కూట‌మికి మ‌ద్ద‌తు తెలిపారు.ప్ర‌చారం కూడా చేశారు.కానీ 2019 ఇరు పార్టీల‌తో విభేదించి నేరుగా పోటీ చేసినా ఓట‌మిపాల‌య్యారు.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన పార్టీలో చెప్పుకోద‌గ్గ నేత‌లు ఎవ‌రూ కూడా చేర‌లేద‌నే చెప్పాలి.

 Latest News Of Pawan Kalyan, Pawan Kalyan, Janasena, Telangana, Ts Poltics, Munu-TeluguStop.com

ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే ఇటు తెలంగాణను కూడా పట్టించు కున్నట్టు ఏమీ అనిపించడం లేదు.వచ్చే డిసెంబర్ లో తెలంగాణ లో ఎన్నికలు జరగనున్నాయి.

అందుకే అక్కడ పరిస్థితి హాట్ హాట్ గా ఉంది.

ఇంకా తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు.

ఈ క్రంమలోనే మునుగోడు ఉపఎన్నిక మరింత హాట్ గా మారిపోయింది.ఇక్కడ ప్రధాన పార్టీలు అన్ని ఉపఎన్నిక బరిలో పోటీ పడాలని ఉవ్విళ్లూరుతుంటే.

పవన్ పార్టీ మాత్రం అస్సలు చప్పుడు చేయడం లేదు.మునుగోడు ఎన్నికకు జనసేన సిద్ధం కాలేదని చెప్పడం.

మా సత్తా సాధారణ ఎన్నికల్లో చూపిస్తాం అని చెప్పడం తప్పు అని అంతా అంటున్నారు.ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో నిలిస్తేనే ఆ పార్టీ బలమెంతో తెలిసేది.

కానీ పవన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా చేస్తున్నాడు.ఇటీవలే బీజేపీ పార్టీ నేత లక్షణ్ కూడా జనసేన తో పొత్తు లేదని చెప్పడంతో కొద్దిగా ఉన్న కన్ఫ్యూజన్ కూడా పోయింది.

ఈయన చెప్పి కన్ఫ్యూజన్ పోగొట్టడంతో జనసేన తెల్నగన నేతలు పవన్ కళ్యాణ్ ను పోటీ చేయమని ఒత్తిడి చేస్తున్నారట.ఈ పరిస్థితుల్లో పవన్ నిర్ణయమే ఇప్పుడు ముఖ్యంగా మారింది.

పొత్తు లేకపోవడంతో పవన్ తెలంగాణ లో తన రాజకీయం తాను చేసుకోవచ్చు.చూడాలి ఈయన నిర్ణయమేంటో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube