సూపర్ స్టార్ మహేష్ ఈమధ్య ఓవర్ లుక్ తోనో లేక తొందరపాటుతోనే చిన్న మిస్టేక్ చేస్తున్నారు.స్టార్ సెలబ్రిటీస్ అంతా తమ బర్త్ డే లకు స్పెషల్ విషెష్ అందించడం కామనే.
అయితే ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ ఈమధ్య ఓ ఇద్దరు స్టార్స్ కి బర్త్ డే విషెష్ అందించారు.మొన్న కింగ్ నాగార్జునకి బర్త్ డే విషెష్ అందించిన మహేష్ నాగార్జునని గారు అని కానీ సర్ అని కానీ సంబోధించలేదు.
మహేష్ బర్త్ డే విష్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా రెస్పెక్ట్ లేకుండా ఎందుకు విష్ చేయాలని అన్నారు.
ఇక లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా కూడా మహేష్ బర్త్ డే విషెష్ అందించాడు.
అయితే మహేష్ ఈరోజు చేసిన ట్విట్టర్ లో కూడా జస్ట్ పవన్ కళ్యాణ్ అని రాసుకొచ్చాడు.మహేష్ చేసిన ఈ ట్వీట్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
మహేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు.వాళ్లు ఎంత క్లోజ్ అయినా సరే జస్ట్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద సర్ అని కానీ లేదా గారు అని కానీ పెడితే బాగుంటుందని అంటున్నారు.