'ఓసి పెళ్ళామా' సాంగ్.. ఖుషి పాటలతోనే అంచనాలు పీక్స్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రజెంట్ నటిస్తున్న మూవీల్లో ‘ఖుషి’ ఒకటి.గత రెండు సినిమాలతో విజయ్ అందుకున్న పరాభవాన్ని మరిపించేలా ఈ సినిమాతో హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

 Kushi Fifth Singe Song Promo Out, Kushi Fifth Singe Song, Kushi, Social Media ,-TeluguStop.com

లైగర్ వంటి భారీ ప్లాప్ తర్వాత విజయ్ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఖుషి( Khushi ).ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్ తో పాటు సమంత కూడా హిట్ కావాలని చూస్తుంది.ఈమె కూడా శాకుంతలం వంటి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కింది.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోగా మూడు పాటలు అయితే చార్ట్ బస్టర్ గా నిలిచాయి.4వ సాంగ్ కు ఇటీవలే రిలీజ్ అయ్యి అది కూడా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు 5వ సింగిల్ కూడా రిలీజ్ చేసి మేకర్స్ పాటలతోనే మరింత అంచనాలు పెంచేయాలని చూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి 5వ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

5వ సింగిల్ ఓసి పెళ్ళామా అనే పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఆగస్టు 26న అంటే రేపు ఫుల్ సాంగ్ రానుంది.ప్రోమో ఆకట్టుకునేలా ఉంది.పెళ్లి తర్వాత స్టార్ట్ అయిన కష్టాల గురించి విజయ్( Vijay Devarakonda ) పాట రూపంలో పాడుతున్నాడు.ఇక ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

హేషం అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా న్రిమిస్తుండగా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

https://youtu.be/oaywyUI6H9o
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube