బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షో నుంచి నిన్న ఉదయం నుంచి ప్రచారం జరిగినట్టుగా కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ షోలో తొలి వైల్డ్ కార్డ్ గా షో ప్రారంభమైన వారం తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చారు.
హౌస్ లోకి వెళ్లిన తరువాత కుమార్ సాయి సైలెంట్ గా ఉండటంతో అతన్ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా సెలక్ట్ చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే నిజాయితీగా గేమ్ ఆడుతూ అటు కంటెస్టెంట్ల దగ్గర, ఇటు ప్రేక్షకుల దగ్గర కుమార్ సాయి మంచి మార్కులు కొట్టేశాడు.
అయితే ఊహించని విధంగా నిన్న ఎలిమినేట్ అయిన కుమార్ సాయి బిగ్ బాస్ బజ్ లో భాగంగా సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కుమార్ సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోనాల్ దగ్గర ఎప్పుడూ వయొలిన్ ఉంటుందని ఆ వయొలిన్ ను మూడ్ కు తగినట్టు వాయిస్తుందని అఖిల్ అభిజిత్ తో లవ్ ట్రాక్ గురించి కామెంట్ చేశారు.

దివి ఎప్పుడూ రాజశేఖర్ మాస్టర్ వెనుకే ఉంటుందని చెప్పారు.మరో కంటెస్టెంట్ లాస్య నవ్వులో నిజాయితీ ఉండదని తెలిపారు.అఖిల్ కు బలం ఉందని బుద్ధి లేదని బలం ఉండి బుద్ధి లేకపోతే నష్టం అని చెప్పారు.
రాజశేఖర్ మాస్టర్ బలం, బలహీనత కామెడీ అని చెప్పారు.సొహైల్ బిగ్ బాస్ విన్నర్ కావడానికి స్నేహాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడని తెలిపారు.తన ఆలోచన ప్రకారం అఖిల్, అభిజిత్ మధ్య గొడవలకు మోనాల్ కారణమని అన్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన అవినాష్ నామినేషన్ అంటే భయపడతాడని.
నామినేషన్ లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడని చెప్పారు.కుమార్ సాయి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.