సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి నటి కృతి సనన్( Kriti Sanon ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు( Mahesh Babu ) నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం రెండు మూడు సినిమాలలో నటించి తెలుగు తెరకు దూరమయ్యారు.
వరుసగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా సొంతం చేసుకున్నటువంటి ఈమె చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఆది పురుష్ ( Adi purush )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు సీతగా పరిచయమైనటువంటి కృతి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది.దీంతో ఈమె సినిమా ఇండస్ట్రీలో తాను మరి కొంత నేర్చుకోవాల్సి ఉంది అంటూ నిర్మాణరంగం వైపు ఆసక్తి చూపుతున్నారు.ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలో స్టార్ స్టేటస్ అనుభవించిన తర్వాత నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే కృతి సనన్ సైతం తన ప్రొడక్షన్ హౌస్ పేరును ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఈమె ప్రారంభించిన ఈ నిర్మాణ సంస్థ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్( Sushanth Singh Rajputh ) ను గుర్తుచేస్తుంది.
ఈమె నిర్మాణ సంస్థకు సుశాంత్ కు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే ఈమె తన నిర్మాణ సంస్థను బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్’ ( Blue Butterfly Films ) పేరిట తన నిర్మాణ సంస్థని అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని కృతి షేర్ చేసింది అసలు ఆ పేరుకి సుశాంత్ సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే.సుశాంత సింగ్ తన సోషల్ మీడియా పోస్టులలో ఎక్కువుగా బ్లూ బట్టర్‌ఫ్లై( Blue Butter Fly ) ఎమోజీని ఉపయోగించేవాడు. ఈ క్రమంలోనే కృతి సనన్ సైతం తన నిర్మాణ సంస్థకు బ్లూ బటర్ ఫ్లై అని పేరు పెట్టడంతో అందరూ సుశాంత్ ను గుర్తు చేసుకుంటున్నారు.అంతేకాకుండా వీరిద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు.
వీరిద్దరూ కలిసి రాబ్తా సినిమాలో నటించారు.