తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన కోసమే ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.డేటా మీ వద్దే ఉందన్న ఆయన మళ్లీ దరఖాస్తులు ఎందుకు అని ప్రశ్నించారు.
రేషన్ కార్డులు ఇవ్వకుండానే కార్డుల వివరాలు అడుగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.
నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే కాంగ్రెస్ నేతలు అహంకారంతో తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.సీఎం ఆదాయం ఎంతో తన ఆదాయం ఎంతో విచారణకు సిద్ధమని కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.
కాళేశ్వరంలో బీజేపీకి వాటా ఉందని దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీనే బీనామీ అని ఆరోపించారు.