T20 World Cup T20 Virat Kohli : ప్రపంచ కప్ లో వరుస రికార్డులను నమోదు చేస్తున్న కింగ్ కోహ్లీ..

టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఇక రిటర్మెంట్ ప్రకటించాల్సిందే అని విమర్శించిన వారు తోనే ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచకప్ లో ప్రశంసల వర్షం కురిసేలా బ్యాటింగ్ చేస్తూ టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు.దక్షిణాఫ్రికా జట్టుతో ఆడిన మ్యాచ్ లో మాత్రమే విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అయ్యాడు.

 King Kohli Is Recording A Series Of Records In The T20 World Cup-TeluguStop.com

మిగిలిన మూడు మ్యాచ్లలో వరుస హాఫ్ సెంచరీలు చేశాడు.

ఇలా వరుస హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ t20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నాడు.టి20 ప్రపంచ కప్ లో 3 అంతకంటే ఎక్కువ సార్లు ఆఫ్ సెంచరీలు చేయడం మన కింగ్ కోహ్లీకి ఇది మూడవసారి.అయితే విరాట్ కోహ్లీ ఒక్కడే మూడు ఎడిషన్లలో 3+ హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా ఉన్నాడు.2014, 2016 టీ20 వరల్డ్ కప్ సీజన్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‘ నెగ్గిన విరాట్, ఆ ఎడిషన్లలో 3+ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.2022లో మూడోసారి ఈ ఫీట్ సాధించి రికార్డు సృష్టించాడు.బంగ్లాదేశ్ చేసిన హాఫ్ సెంచరీ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరియర్ లో 199 హాఫ్ సెంచరీ కావడం విశేషం.

Telugu Cricket, Jacques Kallis, Kohli, Ricky, Tendulkar, Cup, Virat Kohli-Sports

సచిన్ టెండూల్కర్ 264, రికీ పాంటింగ్ 217, కుమార సంగర్కర 216, జాక్వస్ కలీస్ 211 సార్లు 50+ స్కోర్లు సాధించి విరాట్ కంటే ముందు వరుస లో ఉన్నారు.టీ20 ప్రపంచ కప్‌లో 23 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ, 13 హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు.టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ 9 సార్లు 50+ స్కోరు చేసి నాటౌట్‌గా నిలిస్తే, రెండు సార్లు ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు అందరూ కలిసి t20 ప్రపంచకప్‌లో 9 సార్లు ఈ ఫీట్ సాధించారు.వన్డే వరల్డ్ కప్ లలో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేస్తే, టి20 విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube