తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి మనందరికీ తెలిసిందే.కార్తీకదీపం సీరియల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు డాక్టర్ బాబు, వంటలక్క.
ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ సీరియల్ చూస్తుండగానే అప్పుడే 1500 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.2017 అక్టోబర్ 16న తెలుగులో ప్రారంభమైన ఈ సీరియల్ తాజాగా ఐదేళ్లను పూర్తి చేసుకుని విజయవంతంగా 1500 ఎపిసోడ్ మైలు రాయిని అందుకుంది.కాగా ఇప్పటికే బుల్లితెర చరిత్రలో రికార్డులను బద్దలు కొట్టింది కార్తీకదీపం సీరియల్.
జాతీయస్థాయిలో నెంబర్ వన్ సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుంది.
కాగా ఈ సీరియల్ 1500 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న సందర్భంగా మన వంటలక్క, డాక్టర్ బాబు ఇద్దరూ లైవ్ లోకి వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించారు.
ఇక ఆ వీడియోలో డాక్టర్ బాబు వంటలక్క మాట్లాడుతూ లైవ్ లోకి వస్తాం అనుకోలేదు షూటింగ్ మధ్యలో మాకు కాస్త చిన్న గ్యాస్ దొరికింది ఈరోజు కార్తీకదీపం సీరియల్ 1500 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.ఈ సీరియల్ ఇంత మంచి విజయం సాధించినందుకు ప్రేక్షకులు మాకు విషెస్ ను తెలుపుతున్నారు.
ఈ సీరియల్ ఇంత సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది అంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అన్ని తెలిపారు డాక్టర్ బాబు.
సెలబ్రేషన్స్ గురించి చెబుతూ 1000 ఎపిసోడ్ ని బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం.ఇక 1500 ఎపిసోడ్ లో కూడా కేక్ కటింగ్ తో పాటు లంచ్ కూడా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు అని తెలిపాడు డాక్టర్ బాబు. అయినందుకు ముఖ్యంగా పెద్దవాళ్లకు చాలా థాంక్స్ వాళ్ళు అలవాటు చేస్తున్నందుకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ సీరియల్ చూసి బాగా ఆదరిస్తున్నారు.
కాబట్టి కార్తీకదీపం సీరియల్ ఇంత మంచి సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని వంటలక్క డాక్టర్ బాబు. కాగా ఈ వార్తపై పలువురు స్పందిస్తూ వంటలక్క డాక్టర్ బాబుని ఏకిపారేశారు.
ఐదేళ్ల నుంచి మీ సోది కొనసాగుతూనే ఉంది ఎప్పటికి కలుస్తారు అని కొందరు కామెంట్స్ చేయగా ఇంకా మాకు ఎన్నేళ్లు ఈ సోది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.