బాత్రూమ్ లోకి వెళ్లి మెడలో నెక్లెస్ వేసుకున్న పాము... వీడియో వైరల్!

అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉన్న పాముల్లో కింగ్ కోబ్రా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.ఇది విషపూరితమైనది మాత్రమే కాదు చాలా భయంకరంగా కనిపించే పాము కూడా.

 King Cobra Snake Snaps Toilet Tissue Paper Around The Neck Details, Viral Lates-TeluguStop.com

ఇది కాటేస్తే క్షణాల్లోనే చచ్చిపోవడం ఖాయం.అయితే ఇలాంటి డేంజరస్ స్నేక్ ని బాత్రూమ్ లో చూస్తే ఇంకేమైనా ఉందా? గుండె ఆగిపోవాల్సిందే కదా.తాజాగా అలాంటి టెర్రిఫయింగ్ సిట్యుయేషన్ ని ఫేస్ చేసాడో వ్యక్తి.అదృష్టం కొద్దీ ఈ స్నేక్ ని అతడు బాత్ రూమ్ వెలుపల నుంచే చూసాడు.

మొదట్లో ఈ భారీ పాముని చూసి షాక్ అయిన సదరు వ్యక్తి ఆ తరువాత తేరుకొని వీడియో తీసాడు.ఇప్పుడా వీడియో సోషల్ మధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాము బాత్రూమ్ లోకి చొరబడటం గమనించొచ్చు.ఇది వాష్ రూమ్ లో లెట్రిన్ బేసిన్ కింద చుట్టుకుని గోడపైకి పాకుతోంది.

ఇది బాత్ రూమ్ లో ఎంతసేపు ఉందో తెలియదు కానీ దీని మెడలో ఒక టిష్యూ పేపర్ నెక్లెస్ లాగా భలే అట్రాక్టివ్ కనిపించింది.ఇది టిష్యూ పేపర్ నుంచి పైకి వెళ్లాలనుకుందేమో, కానీ పాపం అది దాని మెడలో చిక్కుకుపోయింది.

చూసేందుకు ఇది చిత్రంగా అనిపించింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వామ్మో, ఈ పాము ఏంటి ఇంత పెద్దగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.ఇది టిష్యూ పేపర్ ని నెక్లెస్ లాగా వేసుకుందేంటి అని మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube