ఖమ్మం (Khammam) జిల్లా చురుకైన రాజకీయాలకు పెట్టింది పేరు.ఈ జిల్లా నుంచి ఎంతోమంది అగ్ర నాయకులు రాష్ట్రాన్ని పాలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ జిల్లా నుంచి ఎంతోమంది నేతలు మంత్రులుగా పని చేశారు.
![Telugu Khammam, Mlavanama, Telangana-Politics Telugu Khammam, Mlavanama, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Thummala-nageshwar-rao-Jalagam-venkatrao-Khammam-BRS-party-CM-kcr.jpg)
తెలంగాణ ( Telangana ) రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఖమ్మం జిల్లా నుంచి రాజకీయాలు రూపొందుకుంటూ ఉంటాయి.అలాంటి ఖమ్మం లో ఒకప్పుడు చక్రం తిప్పిన కొంతమంది సీనియర్ నేతలు ప్రస్తుతం చతికిల పడిపోయారు.టికెట్టు కోసం ఎదురు చూస్తూ బాధ పడిపోతున్నారు.
ఒకప్పుడు వారే మిగతా నేతలకు టికెట్లు ఇప్పించే స్థాయి నుంచి నాకు టికెట్ వస్తే బాగుండు అనే స్థాయికి చేరుకున్నారు.మరి ఆ అగ్ర నేతలు ఎవరు.
వారి పరిస్థితి అలా ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.ఒకప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala nageshwar rao ) అంటే తిరుగులేని నాయకుడిగా ఉండేవారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తన హవా నడిపించారు.తాను చెప్పిన వ్యక్తులకే టికెట్ కూడా వచ్చేది.
పది నియోజకవర్గాల్లో తాను చెప్పిన వ్యక్తులకే తప్పకుండా టికెట్ కన్ఫామ్ అయ్యేది.
![Telugu Khammam, Mlavanama, Telangana-Politics Telugu Khammam, Mlavanama, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Thummala-nageshwar-rao-Jalagam-venkatrao-Khammam-BRS.jpg)
అలాంటి తుమ్మల నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.దీంతో నాలుగేళ్లుగా ఖమ్మంలో చిన్నచిన్న మీటింగ్ లు పెడుతూ కార్యకర్తలకు టచ్ లో ఉంటూ వస్తున్నారు.ఈసారైన టికెట్ వస్తుందని ఆశించారు.
కానీ ఆయనకు టికెట్ దక్కకపోవడంతో చాలా బాధపడుతున్నారట.అంతేకాకుండా ఖమ్మంలో మరో కీలక నేత జలగం వెంకట్రావు( Jalagam venkatrao ) .2004లో సత్తుపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆ తర్వాత తుమ్మల మీద 2009లో పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత 2014లో బిఆర్ఎస్ అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి విజయం సాధించారు.లాస్ట్ టైం 2018లో బిఆర్ఎస్ ( Brs )నుంచి రెండోసారి పోటీ చేసి అభ్యర్థి వనామా చేతిలో ఓటమి పాలయ్యారు.
అలాంటి వెంకట్రావు కూడా టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు.