కన్నడం లో కేజీఎఫ్ కి ముందు యశ్( Yash) పెద్దగా గుర్తింపు లేని హీరో.ఇక పాన్ ఇండియా స్థాయి లో యశ్ గురించి ఏ ఒక్కరికి తెలియదు.
అలాంటి యశ్ కి కేజీఎఫ్ సినిమా లు రెండు భాగా లు కూడా భారీ గా పాన్ ఇండియా గుర్తింపును తెచ్చి పెట్టాయి అనడం లో సందేహం లేదు.అందుకే కేజీఎఫ్ 2 కి ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన సినిమా ను చేయాలి అనే ఉద్దేశ్యం తో యశ్ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేక పోతున్నాడు.
యశ్ తదుపరి సినిమా కోసం అభిమానులు రెండేళ్లుగా చూస్తున్నారు.ఇప్పటికి కూడా యశ్ తదుపరి సినిమా గురించి చెప్పలేదు.
యశ్ తన తదుపరి సినిమా ను కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాలని కోరుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అదే కనుక నిజం అయితే ఇద్దరి కాంబో లో కేజీఎఫ్ 3 రావడం పక్కా.అయితే ప్రస్తుతం సలార్ సినిమాను చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఆ సినిమా ను కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నాడు.కనుక 2025 వరకు ఆయన బిజీగా ఉన్నాడు.
కేజీఎఫ్ 3 తోనే రావాలి అని యశ్ అనుకుంటే మాత్రం కచ్చితంగా చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పార్ట్ 3( KGF 3 ) తోనే రావాలి అనుకున్నట్లు అయితే కచ్చితంగా యశ్ తప్పు చేస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యశ్ మళ్లీ వెయ్యి కోట్ల సినిమా ను చేయాలి అంటే సాధ్యం కాదు.వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి కథ లను సినిమా లను చేసుకుంటూ వెళ్లాలి అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కానీ యశ్ మాత్రం పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.మరి అది ఎంత వరకు సాధ్యం అనేది ఆయనకే తెలియాలి.