ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ..!

ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది.సౌత్ రాష్ట్రాల్లో సుమారు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు అరబిక్ భాషలో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

 Nia Foiled A Huge Conspiracy Of Terrorists..!-TeluguStop.com

అదేవిధంగా రూ.60 లక్షల నగదు, 18,200 యూఎస్ డాలర్స్ ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.కాగా కోయంబత్తూర్ లో 22 చోట్ల, హైదరాబాద్ లోని ఐదు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగాయి.అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలోనే రీజనల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు నిర్ధారించారు.భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఎన్ఐఏ తెలిపింది.

ఇందులో భాగంగానే ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను చేర్చుకుంటున్నట్లు వెల్లడించింది.ఈ క్రమంలోనే గత సంవత్సరం అక్టోబర్ 23న కోయంబత్తూర్ లో కారు పేల్చివేత చర్యలకు పాల్పడ్డారని ఎన్ఏఐ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube