ముఖ్యంగా చెప్పాలంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని దాదాపు చాలా మందికి తెలుసు.అయినా కూడా ఈ విషయాన్ని ఎవరు అంతగా పట్టించుకోరు.
ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో ఆల్కహాల్( Alcohol ) తీసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది.ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తాగుతున్నారు.
యువత చాలా మంది దీని బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు.యువతతో పాటు మరి కొంత మంది వివాహమైన వారు కూడా అతిగా మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు.
పండుగలు, పబ్బాలు, చావులు ఏ కార్యమైన ఆల్కహాల్ లేకుండా జరగని పరిస్థితి ఏర్పడింది.వాస్తవానికి అతిగా మద్యం తాగితే లివర్( Liver ) చెడిపోతుందని చాలా మంది చెబుతూ ఉంటారు.

కానీ ఇది ఒకటే కాకుండా శరీరంలో చాలా అవయవాలు చెడిపోతాయని నిపుణులు చెబుతున్నారు.దిని వల్ల మనిషి రోజు రోజుకు చావుకు దగ్గరవుతూ ఉంటాడు.అతిగా మద్యం తాగడం వల్ల ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పై( Digestion System ) చెడు ప్రభావం పడుతుంది.దీని వల్ల గ్యాస్, ఉబ్బరం, విరోచనాలు, పొత్తికడుపు నిండుగా ఉండడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
చివరిగా లివర్ దెబ్బతింటుంది.అంతే కాకుండా అతిగా మద్యం తాగడం వల్ల మైండ్ పై( Brain ) చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా మద్యం తాగడం వల్ల ఏకాగ్రతను కోల్పోతారు.

చేతులు పాదాల్లో తిమ్మిర్లు వస్తాయి.జ్ఞాపక శక్తి( Memory Power ) తగ్గుతుంది.దీంతో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక నరాల సమస్యలు( Nervous System ) వస్తాయి.
ఒకే సారి రకరకాల డ్రింక్స్ తీసుకుంటే రక్తపోటు కూడా పెరుగుతుంది.దీంతో ఎంజైమ్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది.
దీని వలన ప్యాంక్రియాస్ క్యాన్సర్( Pancreatic Cancer ) వచ్చే ప్రమాదం కూడా ఉంది.ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
కాబట్టి మద్యం విషయంలో కాస్త అయినా ఆలోచించడం మంచిది.మద్యం గురించి ఆలోచించకపోయినా మీ తల్లిదండ్రుల గురించి, కుటుంబాల గురించి, మీ పిల్లల గురించి అయినా కచ్చితంగా ఆలోచన చేయాలి.







