కీర్తి సురేష్ ప్రస్తుతం నాని హీరో గా రూపొందుతున్న దసరా సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా దసరా సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.
ఆ పోస్టర్ లో కీర్తి సురేష్ పెళ్లి కూతురు గా కనిపిస్తోంది.అయితే కీర్తి సురేష్ గతం లో ఎప్పుడు చూడని విధంగా తెలుగు ప్రేక్షకులు దసరా సినిమా లో చూడబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది.
పెద్ద ఎత్తున దసరా సినిమా పై అంచనాలు ఉన్నాయి.నాని లుక్ మరియు కీర్తి సురేష్ లుక్ చూస్తుంటే సినిమా కచ్చితంగా మాస్ మసాలా సినిమా అంటూ క్లారిటీ వచ్చేసింది.
కీర్తి సురేష్ గతం లో ఎప్పుడు లేని విధంగా చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నారు.దాంతో అంచనాలు భారీ గా పెరుగుతున్నాయి.
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అంటున్నాడు.కానీ కీర్తి సురేష్ అభిమానులు మాత్రం ఈ విషయం లో ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.కీర్తి సురేష్ ని మేము ఇలా చూడాలి అనుకోవడం లేదు అంటూ చాలా నిరుత్సాహం తో ఉన్నారు.భారీ అంచనాల నడుమరూ పొందుతున్న దసరా సినిమా లో కీర్తి సురేష్ లుక్ మరో రేంజ్ లో ఉంటుందని ఆశించామని దర్శకుడు ఇలా చేయడం తో తాము అసంతృప్తి తో ఉన్నామంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్తున్నారు.
మహా నటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి దేశ వ్యాప్తంగా పాపులారిటీ బాగా పెరిగింది.అయినా కూడా ఆమె ఆ తర్వాత భారీ విజయాలను ఆ స్థాయి సక్సెస్ లను దక్కించుకోవడం లో విఫలమైంది.
ఈ సినిమా తో అయినా ఆమె సక్సెస్ అవుతుందని అంతా భావించారు, కానీ నిరాశ తప్పేలా లేదు అంటూ కీర్తి సురేష్ అభిమానులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు.