మనది కాని దేశం వెళ్ళినపుడు ఒళ్ళు, బుర్ర జాగ్రత్తగా ఉంచుకోవాలి, కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే , అక్కడి నియమ నిబంధనలు తెలిసో, తెలియకో బ్రేక్ చేస్తే చేతికి సంకెళ్లు, రోజూ చిప్ప కూడా తినాల్సి వస్తుంది.ప్రస్తుతం కొందరు భారతీయుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది.
సౌదీ లో ఉంటూ మత పరంగా రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో చేసుకున్న చాటింగ్ చివరికి వారి కొంప ముంచింది.పూర్తి వివరాలలోకి వెళ్తే.
సౌదీ లో భారత్ కి చెందిన కొందరు యువకులు పనిచేస్తున్నారు.వారికి చెందిన వాట్సప్ గ్రూప్ లో మత పరమైన వ్యాఖ్యలు చేయడంతో కొందరు ఆ వ్యాఖ్యలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకోవడం తో ఆ వ్యవహారం కాస్తా సౌదీ పోలీసుల దృష్టికి వెళ్ళింది.
దాంతో చాటింగ్ చేసిన నలుగురిని, అలాగే రికార్డ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఐదుగురిని పోలీసులు సౌదీ కోర్టులో హాజరు పరచగా కోర్టు ముందు తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నారు.
దాంతో
కోర్టు వారికి ఐదు నెలల జైలు శిక్షతో పాటు, వెయ్యి రియాళ్ళ జరిమానా కూడా విధించింది.అయితే కొన్ని రోజుల క్రితమే వారి శిక్షా కాలం పూర్తయినా జరిమానా కట్టక పోవడంతో ఇంకా జైలు జీవితం గడుపుతున్నారు.
తమ దగ్గర డబ్బులు లేవని జరిమానా ఎవరైనా కట్టక పోరా అని ఎదురు చూస్తున్నారు.తమ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి కి ఇది చాలా పెద్ద మొత్తమని తమని విడుదల ప్రాధేయ పడుతున్నారు అయితే.

జరిమానా కట్టలేని వారిని గుర్తించిన అధికారులు వారి తరుపున ప్రభుత్వమే జరిమానా కట్టేలా చర్యలు చేపడుతున్నారు.ఇదిలాఉంటే సౌదీ లో మత పరమైన విషయాలను చాలా సున్నితమైన అంశాలుగా పరిగణిస్తారని భారతీయులు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి స్థానికంగా ఉండే భారతీయ సంఘాలు.







