తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) 64 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇంక నిర్ణయం తీసుకోలేదు.
మొదటినుండి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పేరు వినపడుతున్నా గాని సోమవారం సాయంత్రానికి మరి కొంతమంది సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి.దీంతో ఎవరికి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే జరిగిన ఎన్నికలలో కేసీఆర్ పార్టీ 39 స్థానాలకు పరిమితం కావడం జరిగింది.ఇంత ఘోర ఓటమికి గల కారణాలను ఆ పార్టీ కీలక నాయకులు విశ్లేషించుకుంటున్నారు.
ఇదే సమయంలో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడంతో భవిష్యత్తు కార్యాచరణ పై గెలిచిన నాయకులతో కేసీఆర్ ( KCR )సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గెలిచిన బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేలను అభినందించారు.ప్రజల తీర్పును గౌరవిద్దాం అని వారితో చెప్పినట్లు.వార్తలు వస్తున్నాయి.అదేవిధంగా కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని సూచించారట.ఈ కొత్త ప్రభుత్వం ఎలాంటి మార్పు తీసుకొస్తుందో.
ఆ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంటో అసలు ఏం జరుగుతుందో గమనిద్దాం.ఇదే సమయంలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో సమావేశం ఏర్పాటు చేసి శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందామని కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో తెలియజేయడం జరిగిందంట.