తెలంగాణ కరోనా కేసులకు కారణం సీఎం కేసీఆర్ అంటూ కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన లేదని, పోలీసు రాజ్యం కొనసాగుతోందని మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మన బుద్ధిలేని సీఎం ఇప్పుడు అప్పులపాలు చేశారని,చేస్తున్నారని ఈ అంశాలపై ప్రశ్నించే వారిని అణగతొక్కడానికి కేసులలో ఇరికిస్తున్నారని ఆయన ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
కరోనా ఉద్ధృతి పై కాంగ్రెస్ ముందు నుండి హెచ్చరిస్తున్న దానిని ఏ మాత్రం పట్టించుకోని కెసిఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా ప్రైవేట్ ఆస్పత్రుల లో 50 శాతం పడకలను ప్రజల కోసం తీసుకోవాలని వాటిని రేషన్ కార్డులేని వారి వైద్యంకోసం వినియోగించ వలసిందిగా డిమాండ్ చేస్తున్నట్లు భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు దేశంలోనే సీఎం లందరికంటే ముందంజలో ఉన్న సీఎం కేసిఆర్ కరోనా క్రైసిస్ మొదలైనప్పటి నుండి తన మార్క్ ను చూపించలేక ఈ అంశంలో తనని అన్ని విషయాలలో ఫాలో అయ్యే జగన్ కంటే వెనకపడిపోయారని చాలామంది భావిస్తున్నట్లు ఇండియా టుడే వారు నిర్వహించిన సర్వేలలో బయటపడింది.
ఇలాంటి టైంలో కేసిఆర్ పాలన సామర్థ్యంపై తెలంగాణ కాంగ్రెస్ ఎటాక్ చేయడం ఒక స్ట్రాటజిక్ గేమ్ ప్లేని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.