ఆందోళనకరంగా ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఈ మహమ్మారి బారినపడ్డారు.

 Pranab Mukharji, Corona, Health Bultain-TeluguStop.com

అయితే కొన్ని రోజుల క్రితం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా వైరస్ సోకిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఆయన ఆరోగ్యంపై కొంత మంది వదంతులు సృష్టించారు.

అలాంటివి నమ్మవద్దు అని ప్రణబ్ కుమార్తె వెల్లడించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై తాజాగా వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు.ప్రణబ్ ఆరోగ్యంపై ఆర్మీ ఆసుపత్రి వైద్యులు కొన్ని విషయాలను వెల్లడించారు.ప్రణబ్ ముఖర్జీ డీప్‌ కోమాలోకి ‌ వెళ్లారని తెలిపారు.అంతేకాదు ఇప్పటి వరకు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని వెల్లడించారు.

అంతేకాక ప్రణబ్ కి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యిందని డాక్టర్లు తెలిపారు.ప్రత్యేక వైద్యులు ఎప్పటికప్పుడు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని చెక్ చేస్తున్నారని తెలిపారు.

ఇక ప్రణబ్ కి వెంటిలేటర్ల సహాయంతో వైద్యం అందిస్తున్నారని తెలిపారు.ప్రణబ్ ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు డాక్టర్లు చాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube